ప్రతి నెల 2,11,20,29 తేదిలలో జన్మించిన వారు మరియు పుట్టిన తేదీ, నెల, సం|రం కలపగా 2 వచ్చిన వారు చంద్ర గ్రహ ఆధీనం లో ఉంటారు..
సంఖ్య శాస్త్రం లో 2 వ సంఖ్య చంద్ర గ్రహాన్ని తెలుపుతుంది. మనః కారకుడు చంద్రుడు. . ఈ సంఖ్య ప్రభావం లో జన్మించిన వారు చక్కటి పేరు ప్రతిష్లను పొందుతారు. చక్కటి జ్ఞానం .మరియు సమాజం పట్ల లోతైన అవగాహన ను కలిగి ఉంటారు. బలమైన మానసిక శక్తి ని కలిగి ఉంటారు . కల్పనా శక్తి అపరిమితంగా ఉంటుంది. కొత్త పరిశోధనలు చేస్తారు. వాస్తవాల కంటే కల్పనలే వీరి మనస్సును ఆకర్షిస్తాయి . అందుకే ఈ సంఖ్య లో ఎక్కువ కళాకారులు, కవులు జన్మిస్తారు.
.
జ్ఞాన సంబందమైన విషయాలలో ఆసక్తి ఉంటుంది . ధ్యానం , యోగం , తపస్సు ,అహింస ను ఇష్ట పడతారు. . ఇతరులకు అసాధ్యమైన కార్యాలను వీరు పెద్దగా శ్రమించ కుండా చాలా తేలికగా చేయగలరు . ప్రజల మన్నలను పొందుతారు మంచి ప్రవర్తన గల 2 వ అంకె గల వారు అదర్శ పురుషులుగా కీర్తింప బడతారు .
మానసిక శక్తి లోబడిన వీరు ఆధ్యాత్మిక బలాన్ని సమకూర్చు కుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది . సాధారణంగా వీరిలో ఆత్మ విశ్వాసం తక్కువ గా ఉంటుంది . స్వీయ శక్తి పై విశ్వాసం ఉండదు. . ఇతరులను సామాన్యంగా నమ్మరు. .
2 వ అంకె అధిపతి చంద్రుడు . స్వయం ప్రకాశం కాదు . సూర్య కాంతిని గ్రహించి భూమికి కాంతిని ప్రసరింప చేస్తుంది . కనుక 2 అంకెకు చెందిన వారు ఆధ్యాతికత, ధ్యానం మొదలైన వాటిలో ఏదో ఒక విషయం లో నమ్మకం కలిగి ప్రవర్తిస్తే జ్ఞానం వృద్ది చెందుతుంది .ఉన్నత జీవితం సాధ్యమవుతుంది .
చిన్న కార్యాన్నైనా ఇతరులను విశ్వసించి వారికి అప్పగించరు . ఎ పని నైనా తామే చెయ్యాలనుకుంటారు . అప్పుడే వారికి తృప్తి కలుగుతుంది . కొన్ని సందర్బాలలో అనిశ్చిత వీరి జీవితం లో ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సమస్యలకు ఇబ్బంది పడవలసి. వస్తుంది. . అనవసరమైన సమస్యలు ఎక్కువ అవుతాయి .
వీరు సహజంగా భయ స్వభావులు . ఈ సంఖ్యకు చెందిన వారు కొందరు ఆదర్శ వంతులు గా , తత్వ వేత్తలుగా కీర్తి ని పొందుతారు . మనస్సును అదుపులో ఉంచుకుంటే వీరు అన్ని పనులలోను విజయం సాధించగలరు .
చిన్న విషయాలు సైతం ఎక్కువ చేసి మాట్లాడతారు . అతిశయం చూపడం , అతిశయోక్తిగా మాట్లాడటం వీరికి అలవాటు . అగ్ని వంటి మాటలు దృడమైన వాగ్బలము కలిగి వుంటారు వ్యతిరేకించిన వారికి అణగి ఉంటారు . తనకు లోబడిన వారిని అణచి వేస్తారు . మాటల్లో ధైర్యము కనపరచినా , మనస్సులో భయం ఉంటుంది .
వీరిలో నిజం మాట్లాడే ఉన్నత లక్షణాలు కలవారు ఉంటారు. . కేవలం అబద్దాలు మాట్లాడే అధములు కూడా ఉన్నారు . [ చంద్రునికి కృష్ణ పక్షము , శుక్ల పక్షము ఉంటాయి}
వీరి మనస్సు స్థిరంగా ఉండదు. సందర్భాను సారంగా మారుతూ ఉంటుంది . స్నేహితుల, మిత్రుల ప్రభావం వీరిపై ఉంటుంది. నచ్చిన వారిని కొన్ని సందర్భాలలో అనుకరిస్తారు. సరైన నిర్ణయం తీసుకోలేరు. నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తారు. ఇతరులకు హిత బోద చేయడంలో సిద్ద హస్తులు తాముచేపట్టే కార్యక్రమం విషయంలో పలు పర్యాయాలు ఆలోచించి నిర్ణయానికి రాలేక తడబడతారు . తన్ను చూసి భయ పడే వారిపై విరుచుకు పడతారు . తనపై విరుచుకు పడే వారిని చూసి దాసోహం ఉంటారు . ఇరు రకాల మనస్తత్వం ఉన్న వారు కనుక ధృడచిత్తాన్ని పెంపొందించు కోవాలి .
వీరు ఒంటరిగా ఒక కార్యాన్ని ఆచరించటం కంటే తమకు అనుగుణమైన సంఖ్య వారితో కలసి పనిని ఆచరిస్తే విజయం సాదిస్తారు . వీరికి మానసిక క్రియ కంటే శారీరక క్రియ తక్కువ . ఒక పనిని ప్రారంబించ టానికి ముందు పలు పర్యాయాలు ఆలోచిస్తారు . ఆలోచనలో ఉన్న వేగం ఆచరణలో ఉండదు.. కొన్ని సందర్బాలలో సోమరి తనం కనిపిస్తుంది . వీరికి అన్నిరకాల ప్రతిభలున్నా శారీరక శ్రమ కు ఆసక్తి చూపరు
వీరు విజయం పొందాలంటే ఆత్మ విశ్వాసాన్ని పెంచు కోవాలి . మనస్సులో స్పష్టత లేకపోవడం , వ్యర్దంగా ప్రసంగించడం వంటి లక్షణాలను విడనాడాలి . వ్యర్ధ భయాలను అరికట్టాలి . చిన్న చిన్న విషయాలకే భయపడటం మానివేయాలి. కల్పనల ద్వారా సంపద చేకూరుతుంది . కవులు , రచయితలూ , .ప్రసిద్దిపొందిన నటులు , ఛాయాచిత్ర కళాకారులు , దర్శకులు మొదలైన వారందరూ ఈ సంఖ్యలో జన్మించిన వారే .
ఓటమి కి క్రుంగి పోయే మనస్తత్వం ఉంటుంది . ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వలన మరియు బాగా సున్నిత మనస్కులు కావడం వలన డిప్రెషన్ కు లోబడే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాలలో పిచ్చి వారుగా , ఆత్మ హత్య చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు.. అందుకనే మెడిటేషన్,యోగా వంటి వాటిని వీరు తప్పనిసరిగా ఆచరించాలి.
వీరు జీవితం ప్రధమ భాగంలో అనేక ఒడిదుడుకులను పొందుతారు. జీవిత ద్వితీయ భాగం లో బాగా రాణిస్తారు. `ఉన్నత ఆశయం తో జీవించే వారై అధికారం , సంపద , కీర్తి మొదలైన వి పుష్కలంగా ప్రాప్తిస్తాయి దేవుని పై నమ్మకం , మనో బలం , రెండింటిని , సమర్దవంతంగా ఉపయోగిస్తే గొప్ప ధన వంతులు కావడం తధ్యం. .
ఇతరుల మనస్సు నెరిగి మాట్లాడడంలో నేర్పరులు . విభిన్న మైన పద్దతిలో వృత్తిని ఆచరించి డబ్బును సంపాదించ గలరు . చట్టం , వేదాలు , ఇతిహాసాలను పరి శోధించడం వైపు వీరికి శ్రద్ద ఉంటుంది . లాయరు , ఉపన్యాసకులు , గాయకులూ వంటి వృత్తులందు రాణిస్తారు .
లలిత కళల లో నిష్ణాతులుగా కీర్తి గడిస్తారు . సినిమా , నాట్యం , కావ్యం , చిత్ర లేఖనం , సంగీతం వంటి అనేక ప్రక్రియలలో.వీరికి ప్రవేశం ఉంటుంది. .
ఏకాగ్రతతో ఆచరించే అన్ని వృత్తులలో తప్పనిసరిగా విజయం పొందుతారు . వీరి ఆకర్షణ శక్తీ. ఉంటుంది. పదిమంది వీరిని చూసి ప్రభావితులు కాగలరు. వీరి కలలో కనిపించేవి కొన్ని సందర్భాలలో వాస్తవంగా జరుగుతాయి . వీరు గొప్పవారుగా ,విప్లవాలను సృష్టించే వారుగా ఉంటారు .
చంద్రుడు జల సంబంధమైన ఉపగ్రహం. కనుక వీరికి నీటి సంబంధమైన వృత్తులు కలసి వస్తాయి. కాఫీ టీ ,వంటి వ్యాపారాలు ,పాలు ,ఐస్స్ , చల్లటి పానీయాలు , గ్యాసు , రసాయనాలు , ఆమ్లాలు , ఆసిడ్ , వంటి వ్యాపారాలు మంచి లాభాన్ని ఇస్తాయి .
కళల ద్వారా సంపాదన ఉంటుంది. నాగరిక వస్తువులను విక్రయించడం , వ్యవసాయం , నీటిలో తయారయే వస్తువులను ఉత్పత్తి చేయడం , వస్త్రం , ఆభరణం , ముఖ్యం గా స్త్రీలను ఆకర్షించే నగలు , సువాసన ద్రవ్యాలు , ముత్యాలు ,వజ్రాలు , పగడాలు వంటి రత్న సంబంధ మైన వ్యాపారాలు లాభిస్తాయి .
స్త్రీలు ఇష్ట పడే వస్త్రాలు , బొట్టు , పూలు , సెంట్లు వంటివి విక్రయించడం , తయారు చేయడం , మందుల షాపు , సొగసును చేకూరే తైల సంబంధ వస్తువులను , ఔషధాలను తయారు చేయడం . సినిమా , స్టూడియో , ఫోటో స్టూడియో , కళల సంబంధమైన ఉత్సవ నిర్వహణ , కల్పనా నైపుణ్య ప్రదర్శనకు అనువైన సినిమా రంగం ఇవన్నీ వీరికి అనుకూలమైనవి .
కుండలిని యోగ సంబందమైన రహస్య మార్గాలను కను గొంటారు . మంత్ర పద్దతులతో సిద్ధిని పొందుతారు మంత్ర సిద్ది , సిద్దుల శక్తి , మోహనం , ఉచ్చాటన ,విద్వేషణం , ఆకర్షణం , వంటి ప్రక్రియలు వీరికి సునాయాసంగా వశమవుతాయి.
ఇతరుల మనస్సును , స్వభావాన్ని ఎరిగి మాట్లాడే ప్రతిభ కల వారు . అప్పుడప్పుడు మనసులో దుష్ట ఆలోచనలు మొదలవుతాయి . అటువంటి ఆలోచనలు అరికడితే గొప్ప జీవితం లభిస్తుంది.
ప్రతికార్యం లో మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరిస్తారు . ఎవరితో మాట్లాడినా ఆచి తూచి మాట్లాడతారు
దైవ నమ్మకం , గురు భక్తీ సహజంగా వీరికి అలవడిన మంచి గుణాలు . ఉహ శక్తి
సహజంగానే వీరికి ఎక్కువ . అనవసరమైన భయము , ఆందోళన వీరికి ఉంటాయి . కుటుంబ జీవితంలో చిన్న సమస్యలు ఉంటాయి . సంబంధం లేని కారణాల వల్ల కుటుంబములో అశాంతి యుత వాతావరణం నెల కొంటుంది . కుటుంబ కలహాల వీరికి సాధారణం.
వీరు ఎల్లప్పుడూ తమ భవిష్యత్తు గురించి కాని , గతం గురించి కాని , ఆలోచిస్తూ ఉంటారు .పట్టుదల కల వారు .ధైర్య వంతుల్లా ప్రవర్తిస్తారు . కానీ సహజంగా వీరు పిరికి వారు . ఒంటరిగా ఉహలలో ఆకాశ యానం చేస్తారు . ప్రకృతి దృశ్యాలను చూసి పరవశిస్తారు .
చంద్రధిక్యత గల వీరి మనస్సు సమాజం లోని ప్రతి విషయానికి స్పందిస్తుంది. చంద్రుడు సూర్యుని నుండి శక్తి పొంది ప్రసాదిస్తున్నట్లే, ప్రజల, స్నేహితుల సహాయం తో అద్భుతమైన కార్యాలను సాధిస్తారు. .
వీరు వాక్సుద్ధి కలవారు . సంబాషణ ద్వారా ఇతరులను ఆకర్షిస్తారు . వీరి మాటలకు లోబడిన ప్రజలుంటారు వ
వాదనా పటిమ వుంటుంది . మాటల ద్వారా సంపాదన ఆర్జించే అవకాశం ఉంటుంది . గాయకులూ , ఉపన్యాసకులు , టీవి , రేడియో లలో ప్రసంగించేవారు , న్యాయవాదులు ఈ అంకెకు చెందిన వారుగా ఉంటారు
ఆడంబరాల మీద , మీద , కామ వ్యవహారాల మీద మనస్సు ఆకర్షింప బడుతుంది. మనస్సును అదుపులో ఉంచుకొని , మంచి మార్గం లో. పయనిస్తే ఉన్నతమైన శాశ్వతమైన కీర్తిని పొంద గలరు .
చంద్ర శక్తి కారణం కొందరికి పుత్ర ప్రాప్తి కి ఆటంకం కలిగి , తొలగి పోతుంది . కొందరికి అనేక పనులు చేసి పెడతారు . తమకు సమస్య కలిగినప్పుడు తడబడతారు . తమను కీర్తించే వారికి పూర్హిగా సాయపడతారు . పొగడ్తను ఇష్ట పడతారు. అందమైన ముఖం తో ,ఆకర్షణీయంగా ఉంటారు. వీరి శరీరంలో నీటి గమనం ఎక్కువగా ఉంటుంది . నీటి సంబందమైన ఆహార పదార్దాలను ఇష్ట పడతారు . జ్యోతిష్యం , చిత్ర లేఖనం , చట్టం , సంగీత ప్రక్రియలలో ఆరితేరిన వారి ఉంటారు .
వయస్సు పెరిగిన కొద్ది జీవన విధానం పెరుగుతూ ఉంటుంది . యుక్త వయస్సు తరువాత ఇల్లు , పొలం , వాహనం వంటి ఆస్తులు సమకూరుతాయి . జీవితంలో త్వరగా అభివృద్ధి చెందాలన్న ఆశతో పరస్పర విరుద్దంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని సమయాలలో సమాజం నుండి విడివడి ఒంటరిగా ఉండాలన్న కోరిక కలుగుతుంది పరమ పవిత్రతను గౌరవించే మనస్తత్వం కూడా ఉంటుంది .
వీరికి మంచి కుటుంబ జీవితం ఉన్నా , మధ్య వయస్కులుగా ఉన్నప్పుడు , ఏకాంతంగా ఉండడానికి , ఒంటరిగా ఎక్కువ సమయం గడపటానికి ఇష్ట పడతారు . కొన్ని పనులలో స్నేహ విషయంలో సర్దు బాటు ధోరణిని అవలంబించాలి .
ఏదేని ఒక అలవాటుకు లోనై , వదలి పెట్టలేనందుకు చింతిస్తారు . కనుక చెడు అలవాట్ల జోలికి వెళ్ళ కుండ ఉండడం మంచిది . ప్రపంచము లోని అనేక విషయాలను తెలుసు కొని ఉంటారు అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి . ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండటానికి ఇష్ట పడతారు .
మంచి ఆర్దిక స్తితిలో ఉంటారు ఇతరులలో కలసి పోయే , సర్దు బాటు చేసుకొనే తత్వాన్ని అలవరచు కోవాలి .
ఇతరుల మాటలకు పూర్తిగా లొంగిపోకుండా ఉండుట మంచిది. ధనం విషయం లో ఖర్చులను తగ్గించుకోవాలి. పొదుపు చేయాలి. ఒంటరి తనాన్ని వదిలించుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేయాలి.వీరికి భారీ వ్యాపారాలు సరిపడవు. అదే విధంగా చిట్ ఫండ్స్, ఆర్ధిక కార్యకలాపాలు చేసే వ్యాపారాలకు దూరంగా ఉండాలి. షేర్ లలో పెట్టుబడులు పెట్టరాదు
వీరి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామి తో అనవసర ఘర్షణల జోలికి పోరాదు. మెలకువగా ఉండాలి. వీరు ముఖ్యంగా సున్నితంగా ఉండే లక్షణాన్ని వదిలించుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం లో చూడ కూడదు.
2 సంఖ్య పాజిటివ్ గా ఉండే వారు ప్రపంచ ప్రసిద్దులుగా ఉంటారు. ప్రతి విషయం లో లోతైన అవగాహనను కలిగి సమాజాన్ని నడిపిస్తారు. ఉదా: నారా చంద్రబాబు నాయుడు గారు, మహాత్మా గాంధి మొ| ల వారు.
2 వ సంఖ్య నెగెటివ్ ఉండేవారు అనేక భయాలకు లోనై ఉంటారు. డిప్రెషన్ , మానసిక సమస్యలను కలిగి ఉంటారు. జీవితంలో అనేక సమస్యలను పొంది స్థిరపడకుండా ఉంటారు.
Date Of Birth ను మార్చలేము కనుక జనన తేదీ ని ఇంకా జాతకం ను పూర్తిగా పరిశీలించి పేరు లో అనుకూలమైన మార్పును చేసుకొంటే సమస్యలు లేకుండా ఆదర్శవంత మైన, సమర్ధవంతమైన జీవితాన్ని పొందగలరు.
ఈ నెంబర్ లో జన్మించిన ప్రముఖులు.......
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, నారా చంద్రబాబు నాయుడు, అక్కినేని నాగేశ్వర రావు, మొ|
