Thursday, December 29, 2016
Numerology@Suryadevara Venugopaal: 5,14,23 తేదీలలో జన్మించినవారు- సంతాన సమస్యలు.
Numerology@Suryadevara Venugopaal: 5,14,23 తేదీలలో జన్మించినవారు- సంతాన సమస్యలు.: 5, 14, 23 వ తేదీలలో జన్మించినవారు. ఈ తేదీలందు వివాహం చేసుకోరాదు. Date Of Birth ను మొత్తం Total చేసినప్పుడు 5 వ నెంబరు వచ్చినవారు కూడా 5,...
5,14,23 తేదీలలో జన్మించినవారు- సంతాన సమస్యలు.
5, 14, 23 వ తేదీలలో జన్మించినవారు. ఈ తేదీలందు వివాహం చేసుకోరాదు. Date Of Birth ను మొత్తం Total చేసినప్పుడు 5 వ నెంబరు వచ్చినవారు కూడా 5, 14, 23 వ తేదీలందు వివాహం చేసుకోకూడదు. ఇంకా వివాహ తేదీ మొత్తం Total చేసినప్పుడు 5 వ నెంబరు వచ్చిన తేదీలలో 5 వ నెంబరు కలిగినవారు వివాహం చేసుకోకూడదు.
ఈ తేదీలందు వివాహం చేసుకొంటే సంతానం పొందుటలో సమస్యలు తప్పనిసరిగా వస్తాయి. దంపతులు ఇరువురు 5 వ నెంబర్ కు చెంది 5, 14, 23 వ తేదీలలో వివాహం అయితే సంతానం పొందుటలో తీవ్ర సమస్యలు మరియు జాప్యం ఉంటుంది. కొన్ని సందర్భాలలో సంతానం కలుగదు. ఈ నెంబరు వారు 2 వ తేదీనందు వివాహం చేసుకొంటే కొన్ని సందర్భాలలో వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి.
5 వ నెంబర్ ను కలిగి ఉండి 5, 14, 23 వ తేదీలలో వివాహం జరిగి సంతానం లేనివారు సంతానం కోసం ఈ క్రింది రెమిడిస్ పాటించండి......
సుబ్రహ్మణ్య స్వామి వారిని అర్చించాలి. వీలుంటే ప్రతిరోజూ శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం పఠించాలి. మంగళవారం నందు 1 పూట ఉపవాసం ఉండి అర్చన చేయాలి.
షష్టి దేవిని పూజించాలి.
శ్రీ వేంకటేశ్వర స్వామి కోవెలలో 17 బుధవారాలు, ప్రతి బుధవారం 23 ప్రదక్షిణాలు చేయాలి. చివరి బుధవారం రోజు శ్రీవారికి తులసి పత్రాలు, పుష్పాలతో సహస్రనామ అర్చన జరిపించి యధాశక్తి అన్నదానం (5,7,9,11 మందికి) చేయాలి.
పై విధంగా చేస్తే సంతాన సమస్యలు తొలగిపోతాయి...
సూర్యదేవర శ్రీ వేణుగోపాల్.
సుందరయ్య నగర్, మధిర ఖమ్మం జిల్లా
తెలంగాణా 507203.
venusuryadevara@gmail.com
Subscribe to:
Posts (Atom)
