Monday, June 27, 2016

జన్మ సంఖ్య 1 - లక్షణాలు.. జీవితం (1, 10, 19,28 తేదీలలో జన్మించిన వారి జీవిత విశేషాలు.)


1, 10, 19, 28  తేదీలలో జన్మించినవారికి  అదృష్ట సంఖ్య మరియు జన్మ  సంఖ్య 1 అవుతుంది.
1 వ సంఖ్య నవగ్రహాలలో రవి గ్రహాన్ని సూచిస్తుంది. సహజంగా ఈ తేదీలలో జన్మించిన వారు సాహసోపేతులు గా ఉంటారు. జీవితంలోని ప్రతి విషయంలో ఆశావాదులు గా ఉంటారు. వీరు నాయకులు గా ఉంటారు. నిర్ణయాలు చక్కగా తీసుకొని వాటిని సమర్దవంతంగా అమలు చేస్తారు. వీరికి కష్టించే గుణం ఉంటుంది. వీరి ధైర్యం వీరిని మంచి నాయకులుగా మరియు వ్యాపారవేత్తలు గా మార్చుతుంది.. పెద్ద సంస్థలను, వ్యాపారాలను వీరు ధైర్యం తో  సాహసంతో నిర్వహిస్తారు.. వీరు రాజకీయ లలో ఉన్నత పదవులను పొందగలరు. వీరి సంఖ్యకు నెగెటివ్ సంఖ్యలతో సంబంధం లేకుంటే జీవితంలో అనేక ఉన్నత పదవులను పొందుతారు. కళారంగాలలో వీరి మంచి స్థాయిని పొందగలరు. కళాకారులుగా రాణిస్తారు. మరణించిన పిదప కూడా వీరి ప్రతిష్ట కొనసాగుతూ ఉంటుంది.

వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. వీరు ఎప్పుడు తమను తాము తక్కువ చేసుకోరు. Inferiority complex వీరికి ఉండదు.. ఉన్నత ఆశయాలను కలిగివుంటారు. ఎంతమందిలో ఉన్న వీరిని గుర్తించుట సులభము. Dyanimism వీరి స్వంతం. పోరాట పటిమ ఉంటుంది. శత్రువులను జయిస్తారు. ప్రసిద్ది పొందిన కవులు, వైద్యులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు,  కళాకారులు,  అందరూ ఈ సంఖ్యలో జన్మించిన వారై ఉంటారు.

వీరు ధనాన్ని బాగా సంపాదిస్తారు. అయితే చాలామంది ఆ ధనాన్ని నిలుపుకోలేరు. కొంత తొందరపాటు ధోరణి, దుబారా వంటి లక్షణాలు ఈ సంఖ్య వారికి ఉంటాయి. ఆడంబరాలకు, సంఘం లో పేరు ప్రతిష్ట ల కోసం వీరు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ లోపాన్ని సవరించుకొంటే మంచిది. పొదుపు ఆలవాటు వీరు తప్పనిసరిగా చేసుకోవాలి.

వీరికి రక్తపోటు మరియు గుండె సమస్యలు  సులభంగా వస్తాయి. సమాజంలోని ప్రతి విషయానికి స్పందించే గుణం వీరికి ఉంటుంది. దీని వలన నిద్రలేమి, రక్తపోటు మరియు గుండె భాగానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు  రాగలవు, దీనికై వీరు కొన్ని పరిహారాలు పాటించాలి.

వీరిలోని ప్రధాన లోపం ఇతరుల సలహాలను, మాటలను పట్టించుకోకపోవడం. వీరు కొంత అహంకార వైఖరిని అవలంభిస్తారు. దీనివలన మంచి సలహాలను మంచి స్నేహితులను దూరం చేసుకొంటారు. తమ క్రింద పనిచేసే వారి విషయంలో కొంత కటువు గా ఉంటారు. వారి సమస్యలను ఇబ్బందులను పట్టించుకోరు. తద్వారా కొన్ని సమస్యలను వీరికి వీరే సృషించుకొంటారు.  ధన సంబంధ విషయాలలో జాగ్రత్త గా ఉండరు. అధిక వ్యయం, కొంత ధన నష్టం వీరి జీవితంలో జరిగే వీలుంది.

ఈ తేదీలలో జన్మించే వారందరూ ఒకే లాగా ఉంటారని చెప్పలేము. స్థూలంగా పై లక్షణాలు ఒకే లాగా అందరికీ ఉంటాయి. Destiny Number పై ఆధారపడి కొన్ని లక్షణాలు మారతాయి. ఈ తేదీలలో జన్మించిన వారికి వారి Date Of Birth లో Positive Numbers ఉంటే జీవితంలో అన్ని రంగాలలో అభివృద్ది పధంలో ఉంటారు. Negative Numbers ఉంటే కొంచెం క్లిష్టమైన జీవితాన్ని పొందుతారు.

ఈ తేదీలలో జన్మించిన వారు ప్రతిరోజూ ఉదయం శ్రీ ఆదిత్య హృదయం ను పారాయణం చేసి, ఆదివారం రోజులందు పగటిపూట ఉపవాసం ఉంటే మంచి జీవితాన్ని పొందుతారు. అన్ని సమస్యల నుండి ఊరట లభిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజూ శివ ఆరాధన, గాయత్రి మంత్ర జపం మంచి ఫలితాలను ఇస్తుంది. సంధ్యావంధనం అర్హత ఉన్నవారు క్రమం తప్పకుండ ఉభయసంధ్యలందు సంధ్యావందనం ఆచరిస్తే అన్ని దోషాలు తొలగిపోయి మంచి జీవితం ఉంటుంది..

వీరికి;

LUCKY NUMBERS   1  3  5  9

LUCKY COLOURS    YELLOW  ROSE  ORANGE  LIGHT BLUE

LUCKY DAYS             SUN  TUES  WED  THURS

LUCKY DATES         1  3  5  9  10  14  19 23  30

UNLUCKY NUMBERS   8  17  26
UNLUCKY COLOURS    BLACK  COFFEE COLOUR


LUCKY MARRIAGE DATES   1- 10- 19- 28:  3- 12-21- 30;  9- 18- 27


వీరు ప్రతి రోజు ఆదిత్య హృదయం, సూర్యాష్టకమ్, శివ సహస్రనామ స్తోత్రం  పారాయణం చేయాలి.

ఆదిత్య హృదయం ఈ క్రింద ఇవ్వ బడింది. మంచిఫలితాలకై ప్రతిరోజూ చదవండి.

వీరి పేరు నందు నెగెటివ్ నంబర్స్ రాకుండా ఉండాలి. నెగెటివ్ నంబర్స్ ఉంటే జీవితంలో అన్ని కష్టాలు ఉంటాయి. వీరి పేరు ను NUMEROLOGY, PRONOLOGY, ASTROLOGY మరియుVIBRATION NUMEROLOGY ప్రకారం సవరించాలి. ఈ తేదీలలో జన్మించిన వారి పేరు ను చాలా జాగ్రత్తగా సవరించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. లేని పక్షం లో పేరు మార్చిన ప్పటికి అంతా మంచి ఫలితాలు రావు.

ఈ నెంబర్ లో పుట్టిన వారిలో ప్రముఖులు  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు   మరియు బ్రిటిష్ వారితో పోరాడిన భగత్ సింగ్ గారు..

ఆదిత్యహృదయం





తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |


త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

No comments:

Post a Comment